2023 వన్డే ప్రపంచకప్ రికార్డుల అడ్డాగా మారింది. ఈ ఎడిషన్‌లో నమోదైనన్ని రికార్డులు బహుశా ఏ ఎడిషన్‌లోనూ నమోదై ఉండకపోవచ్చు. ప్రతి మ్యాచ్‌లో పదుల సంఖ్యలో రికార్డులు నమోదవుతున్నాయి. ప్రపంచ రికార్డులు సైతం ఈ ఎడిషన్‌లో సులువుగా బద్దలవుతున్నాయి.
తాజాగా ఇంగ్లండ్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పలు వ్యక్తిగత, టీమ్ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఓ ప్రధానమైన రికార్డు ఉంది. అదేంటంటే.. ప్రపంచకప్ చరిత్రలో ఓ ఎడిషన్‌లో అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. నెదర్లాండ్స్‌పై గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో విజయాన్ని (బంగ్లాదేశ్, నెదర్లాండ్స్) నమోదు చేసింది. నెదర్లాండ్స్ ఇదివరకే రెండు విజయాలు (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) సాధించింది.
ప్రస్తుత ఎడిషన్‌లో పాల్గొన్న మిగతా జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించాయి. ఈ ఎడిషన్‌లో భారత్ అందరికంటే ఎక్కువగా, ఆడిన 8 మ్యాచ్‌ల్లో 8 వరుస విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరి 6 విజయాలు (8 మ్యాచ్‌ల్లో) సాధించాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలో 4 విజయాలు (8 మ్యాచ్‌ల్లో) నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఎడిషన్‌లో పాల్గొన్న పది జట్లు కనీసం రెండ్రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి వరల్డ్‌కప్ రికార్డు నెలకొల్పాయి.
ఇదిలా ఉంటే, బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ గెలుపుతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అర్హత దృష్ట్యా కీలకంగా పరిగణించడుతుంది. వరల్డ్‌కప్ లీగ్ దశ తర్వాత టాప్-7లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment