వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (నవంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు) నమోదు చేశాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ 9 మ్యాచ్‌ల్లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 503 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. హాఫ్ సెంచరీ అనంతరం హిట్‌మ్యాన్ అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నప్పటికీ, ఈ ఫీట్‌తో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ రికార్డులు ఏవంటే..
- వరుస వరల్డ్‌కప్‌లలో (2019, 2023) 500 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడు.
- ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (59) బాదిన ఆటగాడిగా రికార్డు.
- ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు (23) బాదిన కెప్టెన్‌గా రికార్డు.
- ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక ఫోర్లు (58) బాదిన కెప్టెన్‌గా రికార్డు.
- ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు (503) చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు.
- ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో 500 పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు.
- వన్డేల్లో ఓ వేదికపై (బెంగళూరు) అత్యధిక సిక్సర్లు (31) బాదిన ఆటగాడిగా రికార్డు.
- సచిన్ (1996, 2003) తర్వాత రెండు వరల్డ్‌కప్ ఎడిషన్‌లలో 500 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు.
- వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు (13) చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో సచిన్ (21), కోహ్లి (14) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఔటయ్యాక టీమిండియా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. కోహ్లి (46) హాఫ్ సెంచరీకి చేరువ కాగా.. శ్రేయస్ (23) ఆచితూచి ఆడుతున్నాడు. అంతకుముందు శుభ్‌మన్ గిల్ (53) మెరుపు హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 184/2.
Comments
Please login to add a commentAdd a comment