వన్డే ప్రపంచకప్-2023 తమ తొలి మ్యాచ్‌లో ఆడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఉప్పల్ వేదికగా శుక్రవారం పసికూన నెదర్లాండ్స్‌తో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించాలని పాకిస్తాన్ భావిస్తోంది.
కాగా ప్రధాన టోర్నీకి ముందు జరిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వామప్ మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
తమ ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడూ రిథమ్‌లో ఉంటారని, స్పిన్నర్లు తిరిగి గాడిలో పడడం సంతోషంగా ఉన్నానని బాబర్ తెలిపాడు.బౌలింగ్, బ్యాటింగ్ రెండూ కూడా మా బలాలు. మా బ్యాటర్లు టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అద్భుతంగా రాణిస్తారు. ప్రతీ ఒక్క ప్లేయర్ బాధ్యతాయుతంగా ఆడుతారు.
ఇక బౌలింగ్‌లో మా ఫాస్ట్ బౌలర్లు మా ప్రధాన బలం. కానీ మా స్పిన్నర్లు కూడా తిరిగి వారి రిథమ్‌ను పొందారు. రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ మా స్పిన్నర్లు మిడిల్‌ఓవర్లలో వికెట్లు తీశారు. ఇది మాకు శుభపరిణామం. ఇదే జోరును ప్రధానటోర్నీలో కొనసాగిస్తామని పీసీబీ డిజిటిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్ పేర్కొన్నాడు.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు పాకిస్తాన్ తుది జట్టు(అంచనా): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ.
చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment