నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మహ్మద్ రిజ్వాన్(82 బంతుల్లో 69 నాటౌట్), ఆగా సల్మాన్(35 బంతుల్లో 50 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడుగా కెప్టెన్ బాబర్ ఆజం(57) మరో హాఫ్ సెంచరీతో మెరిశాడు.
అయితే తొలి వన్డేలో పాకిస్తాన్ విజయం సాధించినప్పటికి.. నెదర్లాండ్స్ జట్టు చుక్కలు చూపించింది. 314 పరుగుల లక్ష్య ఛేదనను దాదాపు చేరుకున్నంత పని చేసిన డచ్.. చివరకు 298 పరుగుల వద్ద ఆగిపోవడంతో 16 పరుగులతో గెలిచిన పాక్ ఊపిరి పీల్చుకుంది. ఈసారి మాత్రం పాక్ జట్టు నెదర్లాండ్స్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ పాక్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. అయితే బాస్ డీ లీడే 89, టామ్ కూపర్ 66 పరుగులతో రాణించారు. జట్టు స్కోరు 186 కాగా.. ఈ ఇద్దరు చేసిన పరుగులు 155 పరుగులు కావడం విశేషం. మిగతావారంతా సింగిల్‌డిజిట్‌కే పరిమితం అయ్యారు.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం(ఆగస్టు 21న) జరగనుంది.
Series win sealed ✅
— Pakistan Cricket (@TheRealPCB) August 18, 2022
Pakistan win the second ODI by seven wickets 👌#NEDvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/T3vN4YPcU3
Comments
Please login to add a commentAdd a comment