అద్భుత బంతితో బోల్తా కొట్టించి.. ఒంటిచేత్తో క్యాచ్(PC: Cricket Netherlands)
Netherlands vs Pakistan, 3rd ODI (Rescheduled match): పాకిస్తాన్‌తో నామమాత్రపు మూడో వన్డేలో నెదర్లాండ్స్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. పర్యాటక జట్టును 206 పరుగులకే ఆలౌట్ చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం ఒక్కడే 91 పరుగులతో రాణించడంతో పాకిస్తాన్ ఈ మేరకు స్కోరు నమోదు చేయగలిగింది. రీషెడ్యూల్డ్ వన్డే సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తోంది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అద్భుత పోరాటం కనబరిచింది. ఆఖరి వరకు పోరాడి 16 పరుగులతో ఓటమి పాలైంది. ఇక రెండో వన్డేలో మాత్రం పాక్ జట్టు.. ఆతిథ్య జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది.
ఓపెనర్లు విఫలం!
ఈ క్రమంలో ఆదివారం(ఆగష్టు 21) రోటర్‌డామ్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పర్యాటక జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు షఫీక్, ఫఖర్ జమాన్ వరుసగా 2, 26 పరుగులు(43 బంతుల్లో) చేసి నిష్క్రమించారు.
బాబర్ ఆజం(PC: PCB)
బాబర్ ఆజం సెంచరీ మిస్!
ఇలాంటి పరిస్థితుల్లో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజం క్రీజులో పాతుకుపోయాడు. 125 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి స్కోరు బోర్డును పరిగెత్తించే ప్రయత్నం చేశాడు. కానీ.. 43వ ఓవర్ నాలుగో బంతికి ఆర్యన్ దత్ అద్బుత బంతితో ఆజంను బోల్తా కొట్టించాడు. ఒంటి చేత్తో క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు. దీంతో సెంచరీ చేసే అవకాశం పాక్ కెప్టెన్ చేజారింది.
🟠 | @aryandutt77 in fine form 🤌#CricketNL #NEDvPAK #CWCSL https://t.co/ZeOPzJHDfX
— Cricket🏏Netherlands (@KNCBcricket) August 21, 2022
మిగతా బ్యాటర్లలో ఆఘా సల్మాన్ 24, నవాజ్ 27 పరుగులు, మహ్మద్ వసీం జూనియర్ 11 పరుగులు చేయగా.. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో 49.4 ఓవర్లలో 206 పరుగులు చేసి బాబర్ ఆజం బృందం ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కింగ్మా రెండు, ఆర్యన్ దత్ ఒకటి, బాస్ డీ లీడే మూడు, షారిజ్ అహ్మద్ ఒకటి, వాన్ బీక్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: Yuzvendra Chahal Wife: నాకు రెస్ట్ అవసరమైన సమయంలోనే ఇలాంటివన్నీ! నువ్వు నా దానివి!
టీమిండియాను విమర్శించిన పాక్ అభిమానులు.. కనేరియా దిమ్మతిరిగే కౌంటర్!
Comments
Please login to add a commentAdd a comment