వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా అఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులకే డచ్ జట్టు కుప్పకూలింది.
డచ్ బ్యాటర్లలో నలుగురు రనౌట్ల రూపంలో వెనుదిరిగారు. స్టార్ డచ్ బ్యాటర్లు మ్యాక్స్ ఓడౌడ్, అకెరమెన్, కెప్టెన్ స్కాట్ ఎడవర్డ్స్, ఎంగెల్‌బ్రెచ్ట్ రనౌట్లగా పెవిలియన్‌కు చేరారు.
అఫ్గాన్ బౌలర్లలో నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్ రెండు, ముజీబ్ ఒక్క వికెట్ సాధించాడు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్.. టీ20 వరల్డ్ కప్‌కి అర్హత
Comments
Please login to add a commentAdd a comment