ఛీ.. కుక్క బతుకు అని తిట్టుకుంటుంటారు చాలామంది. కానీ ఈ కుక్కను చూశాక కచ్చితంగా అభిప్రాయం మార్చుకుంటారు. నో డౌట్. ఎందుకంటే మనిషి ఎవరి ముందైనా లోకువైనా లేదా తక్కువైతే ఛీ కుక్క బతుకు అని ఈజీగా అనేస్తాడు. నిజానికి వాటి విశ్వాసం ముందు మనిషి ఎందుకు పనికిరాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇక్కడొక వీధి కుక్క అదృష్టం మాములుగా లేదు. ఓ విదేశీయురాలి మనసు దోచుకుని ఆమె తోపాటు విదేశానికి వెళ్లే అదృష్టాన్ని కొట్టేసింది.
వివరాల్లోకి వెళ్తే..నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కి చెందిన మెరల్ బోంటెన్‌బెల్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వచ్చింది. కాశీ నగరం అందాలు ఆస్వాదిస్తూండగా జయ అనే ఆడ వీధి కుక్క ఆమె వద్దకు వచ్చి తచ్చాడింది. ఆమె కూడా ఆ కుక్కను చూసి భలే ముద్దుగా ఉందని కాసేపు దానితో గడిపి వెళ్లిపోయింది. ఐతే ఈ కుక్క ఆమెను కొంతసేపు ఫాలో అయ్యి ఆమె వద్ద ఉండే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో ఇంకో కుక్క ‘జయ’పై దాడి చేసింది.
సమీపంలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు జయను రక్షించాడు. ఈ ఘటన తరువాత బోంటెన్‌బెల్ వెంటనే తన మనసు మార్చుకుని ఆ కుక్కను తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. తనతోపాటు నెదర్లాండ్స్‌కి తీసుకువెళ్లాలని డిసైడ్ పోయింది కూడా. ఆరునెలలపాటు శ్రమించి కుక్కకి పాస్‌పోర్ట్, వీసా ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల అనుమతులు లభించడంతో ఎట్టకేలకు స్వదేశానికి పయనమయ్యేందుకు సిద్ధమైంది బోంటెన్‌బెల్.
అనుకున్నట్లుగానే ఆ కుక్కకి పాస్‌పోర్ట్, వీసా కూడా వచ్చేయండతో సంతోషంగా బోంటెన్‌బెల్ ఆ కుక్కును తనతోపాటు నెదర్లాండ్స్ తీసుకువెళ్లిపోయింది. నిజానికి అదేం జాతి కుక్క కాదు. ఆ కుక్కలో ప్రత్యేకతకు కూడా ఏమిలేదు. అదృష్టం ఆ విదేశీయురాలి రూపంలో వెతుక్కుంటు రావడమే గాక చక్కగా ఆమెను యజామనిగా మార్చుకుని నెదర్లాండ్స్ చెక్కేసింది ఆ వీధి కుక్క.
#WATCH | Varanasi, Uttar Pradesh: A female street dog named Jaya from Varanasi is set to leave India with a proper visa and passport with her new owner from the Netherlands. pic.twitter.com/i57rMJqyjb
— ANI (@ANI) October 26, 2023
(చదవండి: ఇవేం అంత్యక్రియలు? మృతదేహాలను రాబందులకు వదిలేస్తారా!)
Comments
Please login to add a commentAdd a comment