వన్డే వరల్డ్‌కప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా.. ఇవాళ (అక్టోబర్ 17) పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సఫారీలు మరో భారీ స్కోర్‌పై కన్నేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతి భారీ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా.. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేయడం ఖాయమని తెలుస్తుంది. ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో ఈ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా మరోసారి 400 స్కోర్‌ను దాటడం ఖాయమని అభిమానులు అంటున్నారు. సఫారీ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ప్రకారం 400 స్కోర్ వారికి పెద్ద లెక్క కాకపోచ్చు. ఓ మోస్తరుగా ఉండే నెదర్లాండ్స్ బౌలింగ్‌పై సఫారీ హిట్టర్లు ప్రతాపం చూపవచ్చు.
శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో డికాక్ (100), డస్సెన్ (108), మార్క్రమ్ (106) సెంచరీలతో స్వైరవిహారం చేయడంతో 428 పరుగులు స్కోర్ చేసిన సఫారీ టమ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 300కుపైగా స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో డికాక్ మరోసారి శతక్కొట్టడంతో (109) సౌతాఫ్రికా 311 పరుగులు స్కోర్ చేసింది.
వరుణుడు అడ్డుతగులుతాడా..?
ధర్మశాలలో ఇవాళ ఉదయం నుంచి జల్లులు కురుస్తున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా, క్రికెట్‌కు అనుకూలంగా ఉంది. అయితే ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉండటంతో ఏ క్షణంలో అయినా భారీ వర్షం పడే అవకాశం ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమయితే లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్ స్వభావంలో స్వల్పంగా మార్పులు జరుగవచ్చు.
సౌతాఫ్రికాకు సంపూర్ణ ఆధిపత్యం..
సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 7 సార్లు ఎదురెదురుపడగా.. 6 సందర్భాల్లో సౌతాఫ్రికానే విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు ఎదురెదురుపడలేదు. వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్ అవుతుంది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 102 పరుగుల తేడాతో.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 134 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment