CWC 2023: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్‌.. వరుసగా తొమ్మిదో విజయం | CWC 2023: INDIA VS NETHERLANDS Live Updates | Sakshi
Sakshi News home page

CWC 2023: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్‌.. వరుసగా తొమ్మిదో విజయం

Published Sun, Nov 12 2023 3:12 PM | Last Updated on Sun, Nov 12 2023 9:44 PM

CWC 2023: INDIA VS NETHERLANDS Live Updates - Sakshi

నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్‌.. వరుసగా తొమ్మిదో విజయం 
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో రోహిత్‌ సేన వరుసగా తొమ్మిదో మ్యాచ్‌లో విజయం సాధించింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్‌, రోహిత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌, విరాట్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ కూడా బౌలింగ్‌ చేశాడు. ఈ విజయంతో భారత్‌ లీగ్‌ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్‌ 15న జరిగే తొలి సెమీస్‌లో భారత్‌.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

ఆరో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
172 పరుగుల వద్ద నెదర్లాండ్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. మొహమ్మద్‌ సిరాజ్‌ సైబ్రాండ్‌ ఎంజెల్‌బ్రెచ్‌ (45)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
144 పరుగుల వద్ద నెదర్లాండ్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. బాస్‌ డి లీడ్‌ను (12) బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

తొమ్మిదేళ్ల తర్వాత విరాట్‌కు వికెట్‌..
వన్డేల్లో విరాట్‌ తొమ్మిదేళ్ల తర్వాత వికెట్‌ తీశాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను స్టాట్‌ ఎడ్వర్డ్స్‌ (17) వికెట్‌ పడగొట్టాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
72 పరుగుల వద్ద నెదర్లాండ్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మ్యాక్స్‌ ఓడౌడ్‌ (30) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
66 పరుగుల వద్ద నెదర్లాండ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అకెర్‌మన్‌ (35) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 5 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి బరెస్సీ (4) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్‌ స్కోర్‌ 5/1.

రాహుల్‌, శ్రేయస్‌ మెరుపు శతకాలు.. టీమిండియా భారీ స్కోర్‌
కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. వీరిద్దరితో పాటు రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) కూడా హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. 

శతక్కొట్టిన రాహుల్‌
కేఎల్‌ రాహుల్‌ 62 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. బాస్‌ డి లీడ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది రాహుల్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. 

సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్‌
ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపిస్తున్న శ్రేయస్‌ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 346/3గా ఉంది. శ్రేయస్‌తో పాటు కేఎల్‌ (70) క్రీజ్‌లో ఉన్నాడు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్‌ రాహుల్‌
కేఎల్‌ రాహుల్‌ 40 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో రాహుల్‌కు ఇది రెండో హాఫ్‌ సెంచరీ. ఈ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన రాహుల్‌ .. ఆతర్వాతి ఇన్నింగ్స్‌ల్లో మంచి ఆరంభాలే లభించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్‌-5 బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు చేయడం విశేషం. 43 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 312/3గా ఉంది. శ్రేయస్‌ (86), రాహుల్‌ (51) క్రీజ్‌లో ఉన్నారు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్‌.. హ్యాట్రిక్‌
శ్రేయస్‌ అయ్యర్‌ 48 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఎడిషన్‌లో శ్రేయస్‌కు ఇది వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా (77), శ్రీలంకతో (82) జరిగిన మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీలు సాధించాడు. అంతకుముందు పాక్‌పై (53) కూడా ఫిఫ్టి కొట్టాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 244/3. శ్రేయస్‌ (56), కేఎల్‌ రాహుల్‌ (16) క్రీజ్‌లో ఉన్నారు.

కోహ్లి ఔట్‌
హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విరాట్‌ కోహ్లి (51) ఔటయ్యాడు. వాన్‌ డర్‌ మెర్వ్‌ బౌలింగ్‌లో కోహ్లి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 28.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 200/3. శ్రేయస్‌కు (30) జతగా కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి
విరాట్‌ కోహ్లి 53 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో తన వన్డే కెరీర్‌లో 71వ హాఫ్‌ సెంచరీని, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఐదో ఫిఫ్టిని పూర్తి చేసు​కున్నాడు. విరాట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేయడంతో పాటు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా (9 మ్యాచ్‌ల్లో 592 పరుగులు) అవతరించాడు. 28 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 198/2. విరాట్‌ (50), శ్రేయస్‌ (30) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. హిట్‌మ్యాన్‌ ఔట్‌
61 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. బాస్‌ డి లీడ్‌ బౌలింగ్‌లో బరెస్సీకి క్యాచ్‌ ఇచ్చి హిట్‌మ్యాన్‌ వెనుదిరిగాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 129/2. కోహ్లి (12)కి జతగా శ్రేయస్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్‌
ప్రస్తుత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో భీకరఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ మరో హాఫ్‌ సెంచరీ తన సాధించాడు. మీకెరెన్‌ బౌలింగ్‌ ఫోర్‌ కొట్టి హిట్‌మ్యాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో రోహిత్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 109/1గా ఉంది. రోహిత్‌తో పాటు విరాట్‌ కోహ్లి (3) క్రీజ్‌లో ఉన్నాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
100 పరుగుల వద్ద భారత జట్టు మొదటి వికెట్‌ కోల్పోయింది. 11.5 ఓవర్ల వద్ద ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఔటయ్యాడు. అప్పటికే హాఫ్‌ సెంచరీ (51) పూర్తి చేసిన గిల్‌.. మీకెరెన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు.

  • బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 11 ఓవర్లకు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ అర్ధ శతకాలకు చేరువయ్యారు.
  • వన్డే ప్రపంచకప్‌-2023లో చివరి లీగ్‌ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తమ జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.

తుది జట్లు..

భారత్‌:  రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్‌: వెస్లీ బరేసి, మాక్స్ ఓ డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement