With Team India" - Sanju Samson: కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియాపై అభిమానం చాటుకున్నాడు. తాను ఎల్లప్పుడూ జట్టు వెంటే ఉంటానంటూ భావోద్వేగ పోస్టుతో అభిమానుల ముందుకు వచ్చాడు. కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఆడాలని ఆశపడ్డ ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపిన విషయం తెలిసిందే.
మిడిలార్డర్‌లో రాణించగల సత్తా ఉన్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌వైపే మొగ్గుచూపారు. మిస్టర్ 360 ప్లేయర్‌పై నమ్మకం ఉంచిన బీసీసీఐ సెలక్టర్లు సంజూకు 15 మంది సభ్యుల జట్టులో చోటివ్వలేదు.
ఏది జరగాలని ఉందో అదే జరిగింది!
ఈ క్రమంలో.. ‘‘ఏది జరగాలని ఉందో అదే జరిగింది! నేను మాత్రం ముందుకు సాగిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అంటూ సంజూ సోషల్ మీడియా వేదికగా తన భావాలు పంచుకున్నాడు. అయితే, తాజాగా అతడు చేసిన మరో పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా కేరళలోని తిరువనంతపురం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజూ సొంత మైదానం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. సంజూ శాంసన్ పోస్టర్ ముందున్న నెట్స్‌లో శ్రమిస్తూ బంతితో సన్నద్ధమయ్యారు.
కొంచెం బాధగా ఉంది.. కానీ పర్లేదు
ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన సంజూ.. ‘‘టీమిండియాతో ఇలా.. ఈ దైవభూమిలో’’ అంటూ విక్టరీ సింబల్‌ను జతచేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘కొంచెం బాధగా ఉంది.. కానీ పర్లేదు’’ అంటూ సంజూను ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు.
మరికొందరేమో.. ‘‘పాపం సంజూ.. ఇలా పోస్టర్‌తో సరిపెట్టారు. బీసీసీఐ తన నిర్ణయం మార్చుకుని ఉంటే బాగుండేది’’ అంటూ 28 ఏళ్ల వికెట్ కీపర్‌కు అండగా నిలుస్తున్నారు. కాగా నెదర్లాండ్స్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇక వరల్డ్‌కప్‌లో అక్టోబరు 8న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment