ఎదురులేని రిజ్వాన్‌.. గెలుపుతో పాక్‌ బోణీ  | Pakistan Won By 21 Runs Against Bangladesh T20 Tri Series | Sakshi
Sakshi News home page

PAK Vs BAN: ఎదురులేని రిజ్వాన్‌.. గెలుపుతో పాక్‌ బోణీ 

Published Sat, Oct 8 2022 7:01 AM | Last Updated on Sat, Oct 8 2022 7:07 AM

Pakistan Won By 21 Runs Against Bangladesh T20 Tri Series - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: టి20 ప్రపంచకప్‌కు జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (50 బంతుల్లో 78 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, షాన్‌ మసూద్‌ (22 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

తస్కీన్‌ అహ్మద్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేయగలిగింది. యాసిర్‌ అలీ (21 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిటన్‌ దాస్‌ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. వసీమ్‌ 3, నవాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీలో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్‌ తలపడుతుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement