కరాచీ: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టి20లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు రికార్డు స్థాయి భాగస్వామంతో ప్రపంచ రికార్డు నెలకొల్పి జట్టును గెలిపించారు. బాబర్ ఆజం సెంచరీతో చెలరేగగా.. రిజ్వాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. మొయిన్ అలీ (23 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెన్ డకెట్ (22 బంతుల్లో 43; 7 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (19 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) చెలరేగారు.
అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 19.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 203 పరుగులు సాధించింది. బాబర్ ఆజమ్ (66 బంతుల్లో 110 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), మొహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment