టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఆదివారం న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ చతకిలపడింది.
దీంతో తమ సూపర్-8 ఆశలను పాక్ సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ పాక్ ఆటగాళ్లపై ఆ దేశ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విమర్శల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రాను మహ్మద్ రిజ్వాన్ మరింత జాగ్రత్తగా ఆడుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అక్రమ్ మండిపడ్డాడు.
"వారు 10 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారు. మా ఆటగాళ్లకు క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పించలేను. తొలుత మహ్మద్ రిజ్వాన్‌కు అస్సలు గేమ్‌పై అవగాహన లేదు. వికెట్లు తీయడానికే బుమ్రాను రోహిత్ ఎటాక్‌లోకి తెచ్చాడని రిజ్వాన్‌కు తెలుసు.
అటువంటి అప్పుడు అతడి బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. కానీ రిజ్వాన్ మాత్రం రిజ్వాన్ భారీ షాట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. ఇక ఇఫ్తికార్ అహ్మద్‌కి లెగ్ సైడ్ ఆడటం తప్ప ఇంకేమి రాదు. గతకొన్నేళ్లగా జట్టులో భాగమైనా బ్యాటింగ్ ఎలా చేయాలి అతడికి తెలియదు.
పాక్ ఆటగాళ్లకు ఒక్కటే తెలుసు. మేము ఆడకపోతే మాకెంటి నష్టం, కోచ్‌లను కదా తొలగిస్తారని థీమాగా ఉన్నారు. కానీ నావరకు అయితే కోచ్‌లను కొనసాగించి మొత్తం జట్టును మార్చాల్సిన సమయమిదని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment