
రిజ్వాన్ చర్యతో విసుగు.. కోహ్లి ఏం చేశాడంటే! (PC: Star Sports/X)
ICC WC 2023- Ind vs Pak- #Virat Kohli: వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త ఓవర్ చేశాడు. వచ్చీ రాగానే భారత ఫీల్డర్లకు విసుగు తెప్పించాడు. మరి.. ఇలాంటివి చేస్తే రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఊరుకుంటాడా? ఎవరైనా ఏదైనా ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కింగ్‌కు అలవాటు కదా! ఈసారి కూడా అదే పని చేశాడు.
సిరాజ్ మొదలుపెట్టాడు
అసలు విషయమేమిటంటే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ పవర్ ప్లే ముగిసేలోపే తొలి వికెట్ కోల్పోయింది. ఎనిమిదో ఓవర్‌లో మహ్మద్ సిరాజ్.. అబ్దుల్లా షఫీక్(20)ను అవుట్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం క్రీజులోకి వచ్చాడు.
ఈ క్రమంలో.. 13వ ఓవర్లో హార్దిక్ పాండ్యా మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పనిపట్టాడు. దీంతో పాక్ రెండో వికెట్ కోల్పోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.
వెయిట్ చేయించిన రిజ్వాన్
అయితే, క్రీజులోకి వచ్చిన రిజ్వాన్.. బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి టైమ్ తీసుకున్నాడు. బౌలర్ హార్దిక్ పాండ్యాతో పాటు ఫీల్డర్లను కూడా వెయిట్ చేయించాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ... ‘‘ఇంకెంత సేపు’’ అన్నట్లు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అంపైర్‌కు ఈ విషయం గురించి చెప్పాడు.
ఇంకెంత సేపు.. ‘టైమ్’ చూసుకున్న కోహ్లి
ఇక కోహ్లి సైతం రిజ్వాన్ తీరుతో ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడు. చేతి గడియారంలో టైమ్ చూసుకున్నట్లుగా ఫోజు పెట్టి .. ‘‘ఏంటో ఈ ఓవరాక్షన్.. ఇంకెంత సేపు వెయిట్ చేయాలి’’ అన్నట్లుగా యాక్ట్ చేశాడు. రిజ్వాన్ చేష్టలకు అదే రీతిలో బదులిచ్చాడు.
ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్ల సందడి
ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజ్వాన్‌ను ఉద్దేశించి టీమిండియా అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. ‘‘రెడీ అవుతున్న భార్య ఎప్పుడొస్తుందా అని భర్త ఎదురు చూస్తున్నట్లుగా ఉంది కదా.. రిజ్వాన్ యాక్షన్‌కు కోహ్లి రియాక్షన్ అదిరింది.. 12.4వ ఓవర్లో బంతిని తన్నిన విధానం ఉంది చూడండి సూపర్’’ అంటూ రిజ్వాన్‌పై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.
బాబర్‌ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో
కాగా మోతేరా స్టేడియంలో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్తాన్‌ను 191 పరుగులకే కట్టడి చేశారు. మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించిన బాబర్ ఆజం(50)- రిజ్వాన్(49) జోడీని సిరాజ్ విడదీయడం(బాబర్‌ను బౌల్డ్ చేసి)తో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లి 16 పరుగులకే అవుట్ కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
చదవండి: వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు బిగ్ షాక్.. కెప్టెన్‌కు గాయం
Husband waiting for his wife to get ready. pic.twitter.com/ApvHMgg87j
— DJay (@djaywalebabu) October 14, 2023
ye to kapne laga 🤣🤣🤣🤣 pic.twitter.com/lic0shOW26
— Piyush (@piyushmaybe) October 14, 2023
— Out Of Context Cricket (@GemsOfCricket) October 14, 2023