స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న పాకిస్తాన్ తమ తదుపరి సవాల్‌కు సిద్దమైంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ ఆసీస్ పర్యటనకు ముందు పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు.
స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ను తమ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. జియో న్యూస్ ప్రకారం.. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై పీసీబీ నుంచి ఆధికారిక ప్రకటన వెలవడనుంది. ఇప్పటికే పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో రిజ్వాన్ సమావేశమైనట్లు సదరు మీడియా సంస్థ తమ కథనాల్లో పేర్కొంది.
ఈ మీటింగ్‌లోనే పాక్ వన్డే, టీ20ల్లో పాక్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రిజ్వాన్ అంగీకరించినట్లు సమాచారం. ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ సూచన మేరకు రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ పాక్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
కాగా కెప్టెన్సీ పరంగా రిజ్వాన్‌కు అనుభవం ఉంది. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనప్పటకీ, పాకిస్తాన్ సూపర్ లీగ్, దేశీవాళీ టోర్నీల్లో నాయకత్వ పాత్ర పోషించాడు. పీఎస్ఎల్-2021లో అతడి సారథ్యంలోనే ముల్తాన్ సుల్తాన్ ముల్తాన్ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర వైఫల్యం తర్వాత పాక్ కెప్టెన్సీ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం తప్పుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో పాక్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.
చదవండి: IND vs NZ: రెండో టెస్టులో ఘోర ఓటమి.. గౌతం గంభీర్ కీలక నిర్ణయం!?
Comments
Please login to add a commentAdd a comment