రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ పలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీతో (171 నాటౌట్) విరుచుకుపడిన రిజ్వాన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2022లో పంత్ ఇంగ్లండ్‌పై 146 పరుగులు చేశాడు.
నిన్నటి మ్యాచ్‌లో సెంచరీ అనంతరం రిజ్వాన్.. పంత్ పేరిట ఉండిన మరో రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పంత్ డబ్ల్యూటీసీలో 1575 పరుగులు చేయగా.. రిజ్వాన్ 1658 పరుగులు చేసి డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. రిజ్వాన్ పాటు సౌద్ షకీల్ (141) సెంచరీ చేయడంతో పాక్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. షద్మాన్ ఇస్లాం 12, జకీర్ హసన్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 421 పరుగులు వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment