Pak Kid Fans Crazy Reaction On Getting Babar Azam And Rizwan Autograph, Goes Viral - Sakshi
Sakshi News home page

ENG Vs PAK: బుడ్డోడి మోచేతి ధర రూ. 40 లక్షలంట!

Nov 29 2022 6:20 PM | Updated on Nov 29 2022 7:24 PM

Pak Fan Crazy Reaction Babar Azam Autograph-These Arms Worth 40 Lakhs - Sakshi

పాకిస్తాన్‌ జట్టు నుంచి గొప్ప క్రికెటర్లు వచ్చారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమ్రాన్‌ ఖాన్‌, జహీర్‌ అబ్బాస్‌, జావెద్‌ మియాందాద్‌, అమీర్‌ సోహైల్‌, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, సక్లెయిన్‌ ముస్తాక్‌, మొహ్మద్‌ యూసఫ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు. ఈతరం పాక్‌ క్రికెటర్లలో బాబర్‌ ఆజం కూడా గొప్ప క్రికెటర్లలో చోటు దక్కించుకున్నాడు. ఈ మధ్యన ఫాం కోల్పోయి ఇబ్బంది పడుతున్న బాబర్‌ ఆజం మంచి టెక్నిక్‌ గల బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

తాజగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ పురస్కరించుకొని ప్రస్తుతం పాక్‌ జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇస్లామాబాద్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టు డిసెంబర్ ఒకటి నుంచి మొదలుకానుంది. ఇప్పటికే ఇరుజట్లు ఇస్లామాబాద్‌కు చేరుకున్నాయి. కాగా ప్రాక్టీస్‌ ముగించుకున్న అనంతరం బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లు అక్కడికొచ్చిన పిల్లలతో ఇంటరాక్ట్‌ అయ్యారు.

ఈ సందర్భంగా ఆ పిల్లలకు తమ ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. బ్యాట్‌, బాల్‌, షర్ట్‌, చేతులు ఇలా ఎక్కడపడితే అక్కడ ఆటోగ్రాఫ్‌ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పిల్లలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొందరు పిల్లలు బాబర్‌ సంతకం చేసిన బ్యాట్‌ను. మోచేతులు చూపిస్తూ వీటిని వేలం వేస్తున్నామని తెలిపారు. ఒక బుడ్డోడు బ్యాట్‌ ధర రూ. 5 లక్షలని అంటే.. మరొకడు బాబర్‌ ఆజం ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన నా మోచేతి ధర రూ. 40 లక్షలు అని తెలిపాడు.. ఇంకొకడు వచ్చి నా చెంపపై మహ్మద్‌ రిజ్వాన్‌ ముద్దు పెట్టుకున్నాడని.. కానీ దానిని వేలం వేయలేనని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్‌ న్యూస్‌

FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement