పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్‌గా రిజ్వాన్ రికార్డులకెక్కాడు.
రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.
తాజా మ్యాచ్‌తో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 39 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్.. 41.85 సగటుతో 2009 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.
చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే'
Comments
Please login to add a commentAdd a comment