న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సూర్య విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చిన నుంచే కివీస్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా టీ20ల్లో సూర్యకు ఇది రెండో అంతర్జాతీయ సెంచరీ. అంతకుముందు ఇంగ్లండ్‌పై తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.
బాబర్ రికార్డు బ్రేక్ చేసిన సూర్య
ఇక సెంచరీతో చెలరేగిన సూర్య ఓ అరుదైన రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(10) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాబర్ రికార్డును సూర్యకుమార్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తొలి స్థానంలో ఉన్నాడు. 2021 ఏడాదిలో రిజ్వాన్ 13 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు.
చదవండి: IND VS NZ 2nd T20: సూర్యకుమార్ సుడిగాలి శతకం.. సౌథీకి హ్యాట్రిక్
Comments
Please login to add a commentAdd a comment