
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది.
అసలేం ఏమి జరిగిందంటే?
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన పాక్ పేసర్ హారీస్ రవూఫ్ ఆఖరి బంతిని క్లాసెన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో క్లాసెన్‌ను రవూఫ్ ఏదో అన్నాడు. అందుకు ప్రోటీస్ వికెట్ కీపర్ బ్యాటర్ సైతం గట్టిగా బదులిచ్చాడు.
దీంతో అంపైర్లు జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మహ్మద్ రిజ్వాన్ అనవసరంగా జోక్యం చేసుకుని క్లాసెన్ వైపు వేలు చూపిస్తూ ముందు వెళ్లి సైలెంట్‌గా ఆడు అన్నట్లు సైగ చేశాడు.
దీంతో చిర్రెత్తిపోయిన క్లాసెన్ సైతం తన నోటికి పని చెప్పాడు. క్లాసన్ సైతం రిజ్వాన్ పై మాటలతో మండిపడ్డాడు. ఈ క్రమంలో అంపైర్‌లు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
క్లాసెన్‌కు ఫైన్..
కాగా ఈ మ్యాచ్‌లో క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. 97 పరుగులు చేసిన క్లాసెన్ ఆఖరి వికెట్‌గా వెనుదిరగాడు. దీంతో ఔటైన కోపంలో క్లాసెన్ తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు మేరకు క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది.
Fight on the field between Mohammad Rizwan and Heinrich Klaasen.💀😭 pic.twitter.com/XRb4yjYCl4
— MEER YASIR🇵🇸 (@MY_EDITS_56) December 19, 2024