
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ భీకర ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్‌లో ఫైనల్లో 34 పరుగులు సాధించిన రిజ్వాన్.. పాక్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ ఏడాదిలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్ 821 పరుగులు సాధించాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది.
2022 ఏడాదిలో సూర్య ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు ఆడి 801 పరుగులు సాధించాడు. అయితే తాజా మ్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి, రెండు స్థానాల్లో రిజ్వాన్, సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు.
చదవండి: T20 World Cup 2022: భారత్‌తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్!