
పెర్త్ వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి టెస్టులో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్‌కు చోటు దక్కపోవడం అందరని ఆశ్యర్యపరిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందే ఒక్కరోజు ముందే తుది జట్టును ప్రకటించిన క్రికెట్ పాకిస్తాన్.. రిజ్వాన్‌కు ఛాన్స్ ఇవ్వలేదు.
అతడి స్ధానంలో మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు జట్టు మేనెజ్‌మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో పాక్ జట్టు మేనెజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరికాదని మాజీలు సైతం మేనెజ్‌మెంట్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు.
కాగా ఇటీవల కాలంలో పాక్ తరపున రిజ్వాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా రిజ్వాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా వన్డే వరల్డ్‌కప్‌లో కూడా రిజ్వాన్ తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌తో పాకిస్తాన్ యువ ఆటగాళ్లు ఖుర్రం షాజాద్, అమీర్ జమాల్ టెస్టు అరంగేట్రం చేశారు.
ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్
Comments
Please login to add a commentAdd a comment