మొహమ్మద్‌ రిజ్వాన్‌ అరుదైన ఘనత | Mohammad Rizwan Scored Most Aggregate Runs By A Pakistan Wicketkeeper In A Test | Sakshi
Sakshi News home page

మొహమ్మద్‌ రిజ్వాన్‌ అరుదైన ఘనత

Published Sun, Aug 25 2024 6:43 PM | Last Updated on Sun, Aug 25 2024 6:59 PM

Mohammad Rizwan Scored Most Aggregate Runs By A Pakistan Wicketkeeper In A Test

రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓడినా ఆ జట్టు వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో పాక్‌ తరఫున అత్యధిక పరుగులు (ఓ మ్యాచ్‌లో) చేసిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రిజ్వాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు (నాటౌట్‌), రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశాడు. 

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌ 222 పరుగులు చేశాడు. పాక్‌ తరఫున ఓ మ్యాచ్‌లో ఇన్ని పరుగులు చేసిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఎవరూ లేరు. 1980లో తస్లిమ్‌ ఆరిఫ్‌ ఓ మ్యాచ్‌లో 210 (తొలి ఇన్నింగ్స్‌లో 210 నాటౌట్‌) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌ మరో రికార్డు కూడా సాధించాడు. పాక్‌ తరఫున ఓ టెస్ట్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ రెండుసార్లు ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 565 పరుగులు చేసి ఆలౌటైంది.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్‌ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్‌ విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 30న ఇదే వేదికగా జరుగనుంది.

స్కోర్‌ వివరాలు..

పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 448/6 (సౌద్‌ షకీల్‌ 141, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 171 నాటౌట్‌, హసన్‌ మహమూద్‌ 2/70)

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 565 (ముష్ఫికర్‌ అహ్మద్‌ 191, షడ్మాన్‌ ఇస్లాం 93, నసీం షా 3/93)

పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌ 146 (మొహమ్మద్‌ రిజ్వాన్‌ 51, మెహిది హసన్‌ 4/21)

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 30/0 (జకీర్‌ హసన్‌ 15 నాటౌట్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement