ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 3 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం సంప్రదాయక్రికెట్‌కు డేవిడ్ భాయ్ విడ్కోలు పలకనున్నాడు. టెస్టులతో పాటు వన్డేలకు వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్‌కు తన టెస్టు కెరీర్‌లో ఎదు అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదలుగా వార్నర్ ఏమి ఆలోచించకుండా దక్షిణాఫ్రికా లెజెండ్ డేల్ స్టేయిన్ పేరును చెప్పుకొచ్చాడు.
'నా టెస్టు కెరీర్‌లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టేయిన్. 2016-2017లో గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఇప్పటికి నాకు గుర్తుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ సెషన్‌లో డేల్ స్టేయిన్ నిప్పలు చేరిగాడు. బౌన్సర్లతో నన్ను షాన్ మార్ష్‌ను భయపెట్టాడు. 45 నిమిషాల సెషన్ అయితే మాకు చుక్కలు చూపించింది. షాన్ నా దగ్గరకు వచ్చి అతడి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో నాకు అర్ధ కావడం లేదని చెప్పాడు.
కనీసం పుల్ షాట్ ఆడాదామన్న కూడా అవకాశం లేదు. చాలా ఓవర్ల పాటు కనీసం బంతిని కూడా టచ్ చేయలేకపోయాను. ఓ బంతి ఏకంగా నా భుజానికి వచ్చి తాకింది. నొప్పితో విల్లాలాడాను. స్టేయిన్ ఎడమచేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడు బౌలింగ్ చేస్తే ప్రతీ బ్యాటర్‌కు కొంచెం భయం కచ్చితంగా ఉంటుందని' వార్నర్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్ క్రికెట్ చరిత్రలో స్పీడ్‌గన్ స్టేయిన్ తన పేరును సువర్ణఅక్షరాలతో లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టులలో 439 వికెట్లు, వన్డేలలో 196 వికెట్లు, టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment