పాక్‌ బౌలింగ్‌ను తుత్తినియలు చేసిన ఆసీస్‌ బ్యాటర్లు.. భారీ స్కోర్‌ నమోదు | Aussies Scored Huge Score In World Cup Warm Up Game Against Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌ బౌలింగ్‌ను తుత్తినియలు చేసిన ఆసీస్‌ బ్యాటర్లు.. భారీ స్కోర్‌ నమోదు

Published Tue, Oct 3 2023 6:53 PM | Last Updated on Tue, Oct 3 2023 7:20 PM

Aussies Scored Huge Score In World Cup Warm Up Game Against Pakistan - Sakshi

వరల్డ్‌కప్‌కు ముందు ఆడిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ బౌలర్లను ప్రత్యర్ధి బ్యాటర్లు చీల్చిచెండాడారు. ప్రపంచ శ్రేణి బౌలర్లమని విర్రవీగే పాక్‌ బౌలింగ్‌ను ఈ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్దులు తుత్తినియలు చేశారు. తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కివీస్‌ బ్యాటర్లు పాక్‌ బౌలర్లను ఓ రేంజ్‌లో ఆటాడుకుని నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేయగా.. ఇవాళ జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి, నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు పిండుకున్నారు.

ఆసీస్‌ బ్యాటర్లు ప్రధానంగా పాక్‌ పేస్‌ గన్‌ హరీస్ రౌఫ్‌ను టార్గెట్‌ చేసి 9 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు రాబట్టారు. ఆసీస్‌ బ్యాటర్ల ధాటికి రౌఫ్‌తో పాటు మొహమ్మద్‌ వసీం జూనియర్‌ (8-0-63-1), షాదాబ్‌ ఖాన్‌ (10-0-69-1) బలయ్యారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది (6-1-25-0), హసన్‌ అలీ (6-0-23-0), మొహమ్మద్‌ నవాజ్‌ (6-0-34-1) పర్వాలేదనిపించగా..  ఉసామా మిర్‌ 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులు సమర్పించుకన్నాడు. 

ఇరగదీసిన ఆసీస్‌ బ్యాటర్లు..
ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లంతా మెరుపు ఇన్నింగ్స్‌లతో ఇరగదీశారు. ఆరంభంలో డేవిడ్‌ వార్నర్‌ (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (48 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లబూషేన్‌ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (71 బంతుల్లో 77; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), కెమరూన్‌ గ్రీన్‌ (40 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), జోష్‌ ఇంగ్లిస్‌ (30 బంతుల్లో 48; 8 ఫోర్లు, సిక్స్‌) పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఫలితంగా ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement