మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 264 పరుగులకు ఆలౌటైంది. 194/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్.. అదనంగా మరో 70 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 54 అధిక్యం లభించింది. ఇక పాక్ బ్యాటర్లలో షఫీక్(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మసూద్(54), రిజ్వాన్(42) పరుగులతో రాణించారు.
పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు స్పిన్నర్ నాథన్ లయోన్ 4 వికెట్లతో సత్తాచాటాడు.
అంతకుముందు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఖావాజా(42), మిచెల్ మార్ష్(41) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి!
Comments
Please login to add a commentAdd a comment