మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న బ్యాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. అనంతరం బౌలింగ్‌లో కూడా అదరగొడుతుంది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. ఇప్పటివరకు 12 ఓవర్లు వేసిన కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు లయోన్ రెండు, హాజిల్ వుడ్ ఒక్క వికెట్ సాధించారు. దీంతో పాకిస్తాన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
బాబర్ ఆజంకు ఫ్యూజ్‌లు ఔట్..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు బాబర్ ఆజం మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం సింగిల్ డిజిట్ స్కోర్‌కే బాబర్ పెవిలియన్‌కు చేరాడు. బాబర్‌ను ఓ అద్భుతమైన బంతితో కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్ 37 ఓవర్‌లో మూడో బంతిని కమిన్స్ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌గా సంధించాడు.
ఆఫ్‌సైడ్ పడిన బంతి అద్బుతంగా టర్న్ అవుతూ బాబర్ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్తూ స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన బాబర్ తెల్లముఖం వేశాడు. చేసేది ఏమి లేక కేవలం ఒక్క పరుగుతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బాబర్ తొలి టెస్టులో కూడా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: IND vs SA: 'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు'
UNBELIEVABLE!
— cricket.com.au (@cricketcomau) December 27, 2023
Pat Cummins gets rid of Babar Azam again - with another BEAUTY! #OhWhatAFeeling @Toyota_Aus #AUSvPAK pic.twitter.com/iXQ6M7E10l
Comments
Please login to add a commentAdd a comment