కరాచీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం 1999లో అడిలైడ్ టెస్టులో మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డకౌట్ అయ్యాడు. మెక్‌గ్రాత్ వేసిన షార్ట్‌పిచ్ బంతి వేయడంతో సచిన్ కాస్త కిందకు వంగి షాట్ ఆడుదామని భావించాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ కాకుండా అదే లెంగ్త్‌లో వెళ్లి సచిన్ తొడలను తాకుతూ భుజాల పైనుంచి బంతి వెళ్లింది. దీంతో మెక్‌గ్రాత్ అప్పీల్ చేయగా.. అప్పటి అంపైర్ డారెల్ హార్పర్ సందేహం లేకుండా ఔట్ ఇచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్ అయినప్పటికి సచిన్ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ తర్వాత సచిన్ ఎల్బీ అయినట్లు బిగ్‌స్ర్కీన్‌పై క్లియర్‌గా కనిపించింది. కాగా సచిన్ ఎల్బీ క్రికెట్ చరిత్రలో ఫేమస్ ఎల్బీగా మిగిలిపోయింది.
తాజాగా పాక్-ఆసీస్ రెండో టెస్టులో మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈసారి బౌలర్ కామెరాన్ గ్రీన్ కాగా.. బ్యాట్స్‌మన్ అజహర్ అలీ. అప్పటికే 54 బంతులు ఎదుర్కొన్న అజర్ అలీ ఆరు పరుగులు మాత్రమే చేసి క్రీజులో ఇబ్బంది పడుతున్నాడు. ఇది బలంగా భావించిన కామెరాన్ గ్రీన్ తాను వేసిన 23వ ఓవర్లో మెక్‌గ్రాత్‌ను గుర్తుచేస్తూ.. షార్ట్‌లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే అజహర్ అలీ బంతిని సరిగా అంచనా వేయలేక కిందకు వంగాడు. బంతి నేరుగా తొడపై బాగం తాకుతూ వెళ్లింది.
గ్రీన్ అప్పీల్ చేయగానే అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఇది చూసి షాక్ అయిన అజహర్ అలీ.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్ చెబ్తున్నా వినకుండా రివ్యూకు వెళ్లాడు. అజహర్‌ను దురదృష్టం వెంటాడింది. బంతి తొడ బాగాన్ని తాకడానికి ముందు చేతి గ్లోవ్స్‌ను తాకినట్లు రిప్లేలో తేలింది. దీంతో అతను ఎల్బీగా ఔటైనట్లు థర్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
''23 ఏళ్ల క్రితం సచిన్.. ఇప్పుడు అజహర్ అలీ''.. ''అప్పుడు మెక్‌గ్రాత్.. ఇప్పుడు కామెరాన్ గ్రీన్ బౌలర్స్.. మిగతాదంతా సేమ్ టూ సేమ్''..''ఎక్కడ చూసిన ఈ ఆస్ట్రేలియన్ బౌలర్స్ కామన్‌గా ఉంటారు.'' అంటూ కామెంట్స్ చేశారు.ఇక 506 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 171.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు సాధించింది. బాబర్, రిజ్వాన్‌ల 115 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం తర్వాత ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ సఫలమైంది. తర్వాతి బంతికే ఫహీమ్ (0)ను, కొద్ది సేపటికే సాజిద్ (9)ను అవుట్ చేసి ఆసీస్ పట్టు బిగించింది. అయితే మిగిలిన 8 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టడంలో విఫలమైన కంగారూలు తీవ్రంగా నిరాశ చెందారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి లాహోర్‌లో మూడో టెస్టు జరుగుతుంది.
చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు
MS Dhoni: నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్
Green gets Azhar after lunch. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/M161IxLr6s
— Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022
Comments
Please login to add a commentAdd a comment