పాకిస్తాన్‌పై సూపర్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన డేవిడ్‌ వార్నర్‌ | ICC ODI WC 2023: David warner equals virat kohli record | Sakshi
Sakshi News home page

WC 2023 PAK vs AUS: పాకిస్తాన్‌పై సూపర్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన డేవిడ్‌ వార్నర్‌

Published Fri, Oct 20 2023 4:43 PM | Last Updated on Fri, Oct 20 2023 6:07 PM

ICC ODI WC 2023: David warner equals virat kohli record - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పాకిస్తాన్‌ బౌలర్లకు వార్నర్‌ చుక్కలు చూపించాడు.

ముఖ్యంగా పాక్‌ స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌కు అయితే డేవిడ్‌ భాయ్‌ ఓ ఆట ఆడకున్నాడు. వార్నర్‌తో పాటు మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి దెబ్బకు రవూఫ్‌ కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. వార్నర్ 129 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తుండగా.. మిచెల్‌ మార్ష్‌(121) పరుగులు చేసి ఔటయ్యాడు.

విరాట్‌ కోహ్లి రికార్డు సమం.. 
కాగా పాకిస్తాన్‌పై ఇది వార్నర్‌కు నాలుగో సెంచరీ. తద్వారా ఓ అరుదైన ఘనతను వార్నర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే జట్టుపై వరుసగా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన విరాట్‌ కోహ్లి రికార్డును వార్నర్‌ సమం చేశాడు. ఇప్పటివరకు  కోహ్లి వెస్టిండీస్‌పై 4 సార్లు వన్డేల్లో సెంచరీ సాధించాడు. అయితే కోహ్లి ఈ ఘనతను కేవలం ఒకే ఏడాదిలో అందుకున్నాడు. 2017-18 కాలంలో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. వార్నర్‌ మాత్రం 2017-2023 కాలంలో ఈ రికార్డును నమోదు చేశాడు.
చదవండి: IND vs BAN: బంగ్లాతో మ్యాచ్‌కు అతడిని ఎందుకు ఆడించారు? భారత జట్టు మేనెజ్‌మెంట్‌పై గవాస్కర్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement