కోహ్లి రికార్డు బ్రేక్‌ చేసిన వార్నర్‌.. వన్డే వరల్డ్‌కప్‌ హిస్టరీలో ఇక.. | WC 2023 Aus Vs NZ: Warner Goes Past Kohli For Most Runs In ICC ODI WC | Sakshi
Sakshi News home page

WC 2023: కోహ్లి రికార్డు బ్రేక్‌ చేసిన వార్నర్‌.. వన్డే వరల్డ్‌కప్‌ హిస్టరీలో ఇక

Published Sat, Oct 28 2023 1:20 PM | Last Updated on Sat, Oct 28 2023 1:32 PM

WC 2023 Aus Vs NZ: Warner Goes Past Kohli For Most Runs In ICC ODI WC - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023లో హవా కొనసాగిస్తున్నాడు. గత మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై సెంచరీ(104)తో చెలరేగిన వెటరన్‌ ఓపెనర్‌.. తాజాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకంతో మెరిశాడు.

ధర్మశాల వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌ భాయ్‌.. ఐదు ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు. దీంతో ప్రపంచకప్‌ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 
ఆరు మ్యాచ్‌లలో కలిపి 413 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

వరల్డ్‌కప్‌-2023లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్న వార్నర్‌.. కివీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న రికార్డును వార్నర్‌ బద్దలుకొట్టాడు. ఈ లిస్టులో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌, ఆస్ట్రేలియా లెజెండ్‌ రిక్కీ పాంటింగ్‌, శ్రీలంక దిగ్గజ బ్యాటర్‌ కుమార సంగక్కరల తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

కాగా వార్నర్‌ 23 వరల్డ్‌కప్‌ ఇన్నింగ్స్‌లో 1405 పరుగులు సాధించగా.. కోహ్లి 31 ఇన్నింగ్స్‌లో 1384 రన్స్‌తో ఈ జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆసీస్‌తో తాజా మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని కంగారూ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement