![Virat kohli Equals David Warner Most 500 runs seasons in IPL](/styles/webp/s3/filefield_paths/kohli.gif.webp?itok=UPLkygAg)
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు విల్ జాక్స్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 201 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ 16 ఓవర్లలో ఊదిపడేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్‌లో రన్ ఛేజింగ్‌లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో లక్ష్య చేధనలో కోహ్లి ఇప్పటివరకు 24 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 23 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో ధావన్‌ను కింగ్ కోహ్లి అధిగమించాడు.
→అదే విధంగా ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సార్లు 500 పైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు. వార్నర్ ఇప్పటివరకు 7 సీజన్లలో 500 పైగా పరుగులు చేయగా.. విరాట్ కూడా సరిగ్గా 500 ప్లస్ పరుగులు చేశాడు. ఐపీఎల్-2024లో ఇప్పటివరకు మ్యాచ్‌లు ఆడినహ్లి 500 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment