సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు. హాజిల్‌వుడ్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు పడగొట్టి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు 14 పరుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాకిస్తాన్.. కేవలం 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(6), అమీర్ జమాల్(0) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. హెడ్, లయోన్, స్టార్క్ తలా వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యంతో కలుపుకుని 82 పరుగుల ముందుంజలో పాక్ ఉంది.
అంతకుముందు 116/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబుషేన్(60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లబుషేన్‌తో పాటు మిచెల్ మార్ష్(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: Aus Vs Pak: జారిపడ్డ పాక్ ఫీల్డర్!.. 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు? వీడియో
Comments
Please login to add a commentAdd a comment