స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ తరఫున కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కు తాకలేకపోయారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్ ఆసీస్ టాప్ స్కోరర్‌గా జోస్ ఇంగ్లిస్ నిలిచాడు. ఇంగ్లిస్ తొలి వన్డేలో 49 పరుగులు చేశాడు. ఇదే ఈ సిరీస్ మొత్తానికి ఆసీస్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్.
పాక్‌తో సిరీస్‌లో బ్యాటర్ల చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఆసీస్ 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 22 ఏళ్లలో సొంతగడ్డపై పాకిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం ఆసీస్‌కు ఇదే మొదటిసారి. ఇవాళ (నవంబర్ 10) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 31.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (3/32), నసీం షా (3/54), హరీస్ రౌఫ్ (2/24), మొహమ్మద్ హస్నైన్ (1/24) ఆసీస్ పతనాన్ని శాశించారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో సీన్ అబాట్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ (22), ఆరోన్ హార్డీ (12), ఆడమ్ జంపా (13), స్పెన్సర్ జాన్సన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37) రాణించగా.. బాబర్ ఆజమ్ (28), మొహమ్మద్ రిజ్వాన్ (30) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో లాన్స్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి వన్డేలో గెలుపొందగా.. పాక్ వరుసగా రెండు, మూడు వన్డేల్లో గెలిచింది.
ఈ సిరీస్‌లో ఆసీస్ బ్యాటర్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
జోస్ ఇంగ్లిస్- 49 (తొలి వన్డే)
స్టీవ్ స్మిత్- 44 (తొలి వన్డే)
స్టీవ్ స్మిత్- 35 (రెండో వన్డే)
పాట్ కమిన్స్- 32 (తొలి వన్డే)
సీన్ అబాట్- 30 (మూడో వన్డే)
Comments
Please login to add a commentAdd a comment