
వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 85 వార్నర్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. డేవిడ్ భాయ్ పాకిస్తాన్ బౌలర్లకు మాత్రం చుక్కలు చూపించాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 124 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్‌తో తొలి వికెట్‌కు ఏకంగా 259 పరుగుల భారీ బాగస్వామ్యం నెలకొల్పాడు.
పుష్ప సెలబ్రేషన్..
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత వార్నర్ పుష్ప సెలబ్రేషన్ జరుపుకున్నాడు. తగ్గేదేలే అన్నట్లు పుష్ప మేనరిజం చూపించాడు. దీంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో కూడా చాలా సార్లు పుష్ఫలో అల్లు అర్జున్ తరహా డ్యాన్సులు, డైలాగ్‌లతో వార్నర్ అభిమానులను అలరించాడు.
చదవండి: India vs New Zealand: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. హార్దిక్ దూరం! జట్టులోకి విధ్వంసకర ఆటగాడు
Warner 🤝 Pushpa celebration.
— Johns. (@CricCrazyJohns) October 20, 2023
- The craze for Allu Arjun....!!!!pic.twitter.com/YmKGFQBPfc