
పెర్త్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆ్రస్టేలియా తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మ్యాచ్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (0), లబుషేన్ (2) విఫలం కాగా...ఉస్మాన్ ఖాజా (34 నాటౌట్), స్టీవ్ స్మిత్ (43 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 79 పరుగులు జత చేశారు.
ప్రస్తుతం ఆ్రస్టేలియా ఓవరాల్ ఆధిక్యం 300 పరుగులకు చేరింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 132/2తో ఆట కొనసాగించిన పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్‌కు 216 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇమామ్ ఉల్ హక్ (199 బంతుల్లో 62; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...చివర్లో సౌద్ షకీల్ (28), ఆగా సల్మాన్ (28 నాటౌట్) చివర్లో కొన్ని పరుగులు జత చేశారు. 3 వికెట్లు తీసిన నాథన్ లయన్ తన టెస్టు వికెట్ల సంఖ్యను 499కి చేర్చుకోగా...కమిన్స్, స్టార్క్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అయితే ఫాలో ఆన్ ఇవ్వకుండా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment