సాక్షి, హైదరాబాద్: వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన వేదికపై పాకిస్తాన్ తమ రెండు ‘వామప్’ మ్యాచ్‌లనూ కోల్పోయింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో గత శుక్రవారం కివీస్ చేతిలో ఓడిన పాక్ మంగళవారం ఆసీస్ చేతిలోనూ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 14 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.
అయితే ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లకూ మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. తొలి ‘వామప్’లాగే ఈసారీ భారీ స్కోర్లు నమోదయ్యాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (71 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇన్‌గ్లిస్ (48), వార్నర్ (48), లబుషేన్ (40), మిచెల్ మార్ష్ (31) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు.
అనంతరం పాకిస్తాన్ 47.4 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 90 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్ (85 బంతుల్లో 83; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మొహమ్మద్ నవాజ్ (42 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. పాక్ ఇన్నింగ్స్ చాలా చాలా ముందుగా ముగిసేదే కానీ ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్లకు కూడా ‘వామప్’ అవకాశం కల్పించింది. లబుషేన్, స్మిత్, వార్నర్ కలిపి 14.4 ఓవర్లు వేసి ఏకంగా 159 పరుగులిచ్చారు. పాక్ తమ తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌లోనే శుక్రవారం నెదర్లాండ్స్‌తో, ఆ్రస్టేలియా తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం భారత్‌తో చెన్నైలో ఆడుతుంది.
చదవండి: Sanju Samson: ‘టీమిండియా’తో సంజూ శాంసన్.. కొంచెం బాధగా ఉంది... కానీ పర్లేదు!
Comments
Please login to add a commentAdd a comment