ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ రెండో టెస్ట్ అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్స్‌కు చేరే జట్లపై క్లారిటీ వచ్చింది. డబ్యూటీసీ ఫైనల్స్ రేసులో మొత్తం తొమ్మిది జట్లు ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరడం దాదాపుగా ఖరారైపోయింది.
Australia jumps to the second spot in the World Test Championship 2023-25 points table after their victory against New Zealand in the second Test. pic.twitter.com/9xN3aCeAb9
— CricTracker (@Cricketracker) March 11, 2024
ప్రస్తుత సైకిల్‌లో ఆస్ట్రేలియా ఏడులో నాలుగు, భారత్ పదిలో ఐదు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా జట్లలో సౌతాఫ్రికా ఎనిమిదిలో ఏడు.. న్యూజిలాండ్ ఎనిమిదిలో ఆరు.. పాకిస్తాన్ తొమ్మిదిలో ఏడు.. వెస్టిండీస్ తొమ్మిదిలో ఏడు.. ఇంగ్లండ్ 12కు 12.. బంగ్లాదేశ్ పదిలో ఏడు... శ్రీలంక 11లో ఎనిమిది మ్యాచ్‌లు గెలిస్తే డబ్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.
మిగతా జట్లతో పోలిస్తే.. భారత్, ఆసీస్‌లకు ఫైనల్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆసీస్ తాము ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు భారత్‌తో (స్వదేశంలో).. రెండు శ్రీలంకతో షెడ్యూలై ఉన్నాయి.
Current cutoff for wtc final
— ICT FAN💙💙(MODI'S FAMILY) (@SAHURAGHAV26) March 11, 2024
Probably india and austrailia will play final #WTC25 pic.twitter.com/vqRGjIUHxp
భారత్.. రెండు బంగ్లాదేశ్‌తో (స్వదేశంలో).. మూడు న్యూజిలాండ్‌తో (స్వదేశంలో).. ఐదు ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. వీటిలో టీమిండియా సగం మ్యాచ్‌లు గెలిచినా టీమిండియా సునాయాసంగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
సౌతాఫ్రికా విషయానికొస్తే.. వెస్టిండీస్‌తో రెండు, బంగ్లాదేశ్‌తో రెండు, శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు (స్వదేశంలో) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
న్యూజిలాండ్.. శ్రీలంకతో రెండు, భారత్‌తో మూడు, ఇంగ్లండ్‌తో మూడు (స్వదేశంలో)
పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌తో రెండు (స్వదేశంలో), ఇంగ్లండ్‌తో మూడు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, వెస్టిండీస్‌తో రెండు
వెస్టిండీస్.. ఇంగ్లండ్‌తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), బంగ్లాదేశ్‌తో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు
ఇంగ్లండ్.. వెస్టిండీస్‌తో మూడు (స్వదేశంలో), శ్రీలంకతో మూడు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో మూడు, న్యూజిలాండ్‌తో మూడు
బంగ్లాదేశ్.. శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు, భారత్‌తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), వెస్టిండీస్‌తో రెండు
శ్రీలంక.. బంగ్లాదేశ్‌తో రెండు, ఇంగ్లండ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో రెండు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో రెండు (స్వదేశంలో)
Comments
Please login to add a commentAdd a comment