ముల్తాన్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టు వరల్డ్ టెస్ట్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో (2023-25) పాక్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం 16.67 విజయాల శాతం కలిగి ఉంది.
మరోవైపు పాక్‌పై ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో 45.59 విజయాల శాతం కలిగి ఉంది.
పాయింట్ల పట్టికలో భారత్ (11 మ్యాచ్‌ల్లో 74.24 విజయాల శాతం) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా (12 మ్యాచ్‌ల్లో 62.50 విజయాలు శాతం) రెండు.. శ్రీలంక (9 మ్యాచ్‌ల్లో 55.56 విజయాల శాతం) మూడు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. డబ్ల్యూటీసీ సైకిల్ ముగిసిన అనంతరం టాప్-2లో ఉండే జట్లు ఛాంపియన్‌షిప్ కోసం పోటీపడతాయి.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో ఇవాళ ముగిసిన ముల్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది.
267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో 2, క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టారు.
పాక్ చెత్త రికార్డులు..
2022 నుంచి పాక్ స్వదేశంలో ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా గెలువలేదు.
గత రెండేళ్లలో 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ ఏడింట ఓడిపోయి, నాలుగు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో 500 ప్లస్ స్కోర్ చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓడిన తొలి జట్టుగా పాక్ చెత్త రికార్డు మూటగట్టుకుంది.
పాక్ స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1331 రోజులవుతుంది.
పాక్ కెప్టెన్‌గా తొలి ఆరు మ్యాచ్‌లు ఓడిన షాన్ మసూద్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు.
చదవండి: పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment