వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన భారత్.. పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి దిగజారిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో టీమిండియా తొలిస్దానంలో ఉండేది. కానీ ఈ ఓటమితో ఇప్పుడు భారత్ పాయింట్ల శాతం ఏకంగా 44.44కు పడిపోయింది.
ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో టాప్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా తర్వాతి స్ధానాల్లో వరుసగా పాకిస్తాన్(61.11),న్యూజిలాండ్(50.0) జట్లు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్ధానంలో ఉంది.
కాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది. అదే విధంగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. తమ స్ధానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.
చదవండి: IND Vs SA 2nd Test: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..
Comments
Please login to add a commentAdd a comment