
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 మూడో ఎడిషన్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఈ సైకిల్ భాగంగా డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయం ఫలితంగా డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్ధానానికి చేరుకుంది.
వెస్టిండీస్‌పై విజయంతో భారత్ 12 పాయింట్లు సేకరించి, 100 విజయ శాతం కొత్త పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. అంతకుముందు ఆస్ట్రేలియా 22 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కానీ యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలవ్వడంతో కంగారూల విజయ శాతం 61.11గా ఉంది. దీంతో రెండో స్ధానానికి ఆసీస్ దిగజారింది.
అదే విధంగా యాషెస్ తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు వారి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 2 పాయింట్లను ఐసీసీ కోత విధించింది. ఇది కూడా ఆసీస్ రెండో స్ధానానికి పడిపోవడంలో ప్రభావం చూపింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్‌లో ఉండగా.. ఆసీస్, ఇంగ్లండ్ వరుసగా రెండు మూడు స్ధానాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: Ind Vs Wi: వెస్టిండీస్ వెన్నులో వణుకు పుట్టించాడు.. దిగ్గజ బౌలర్ సరసన చేరిన అశ్విన్!
Comments
Please login to add a commentAdd a comment