ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయంపై వరుణుడు నీళ్లు జల్లాడు. వర్షం కారణంగా రెండో టెస్టు పలితం తేలకుండా పోయింది. పలుమార్లు వాన రావడం, తగ్గడం, మళ్లీ రావడం జరిగాయి. ఆట ఆరంభమవుతుందని అనిపించడం, పిచ్‌ను సిద్ధం చేసే ప్రయత్నం చేయడం, అంతలోనే చినుకులతో పరిస్థితి మారిపోవడం తరచుగా జరిగింది.
చివరకు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2:50కు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీమిండియా 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ని సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి సత్తా చాటిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్టు లభించింది. అనంతరం జూలై 25 నుంచి ఇరు జట్లు మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
రెండో స్ధానానికి పడిపోయిన టీమిండియా
ఇక రెండో టెస్టు డ్రా ముగియడం.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో టీమిండియాపై తీవ్ర ప్రభావం పడింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు రెండో స్ధానానికి పడిపోయింది. రెండో టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియాకి 33.33 శాతం పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీమిండియా విన్నింగ్ శాతం 66.66కి పడిపోయింది.
అంతకుముందు తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన టీమిండియా 100 గెలుపు శాతంతో తొలి స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఒక వేళ ఈమ్యాచ్‌లో విజయం సాధించివుంటే 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్‌తో తన తొలి స్ధానాన్ని కాపాడుకుండేది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ అగ్రస్ధానంలో ఉంది. శ్రీలంకపై తొలి టెస్టులో విజయం సాధించిన పాక్ 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్ టాప్‌కు చేరుకుంది.
చదవండి: #Rohit Sharma: మా దురదృష్టం.. అతడి లాంటి ఆటగాళ్లు జట్టుకు కావాలి! కొంచెం కూడా భయపడలేదు
𝗨𝗣𝗗𝗔𝗧𝗘
— BCCI (@BCCI) July 24, 2023
The rain plays spoilsport as the Play is Called Off on Day 5 in the second #WIvIND Test! #TeamIndia win the series 1-0! 👏 👏 pic.twitter.com/VKevmxetgF
Comments
Please login to add a commentAdd a comment