ఎన్నో బాధలు.. ఎన్నో కష్టాలు! కట్‌చేస్తే ఇప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ? | Who is Akash Deep: The Bengal Pacer Given his Maiden India Test Call-up | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఎన్నో బాధలు.. ఎన్నో కష్టాలు! కట్‌చేస్తే ఇప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ?

Published Sat, Feb 10 2024 12:11 PM | Last Updated on Sat, Feb 10 2024 12:56 PM

Who is Akash Deep: The Bengal Pacer Given his Maiden India Test Call-up - Sakshi

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్‌ ప్రకటించింది. అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అదే విధంగా మిడిలార్డర్‌ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా వెన్ను గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే అనూహ్యంగా బెంగాల్‌ స్పీడ్‌ స్టార్‌ ఆకాష్‌ దీప్‌కు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టుకు ఎంపిక చేశారు.

పేసర్‌ అవేష్‌ ఖాన్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటి.. ఆకాష్‌ దీప్‌కు పిలుపునిచ్చింది. కాగా గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు ఎంపికైనప్పటికీ ఆకాష్‌కు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యాడు.

ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనాధికార టెస్టు సిరీస్‌లో కూడా ఆకాష్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన దీప్‌ 13 వికెట్లు పడగొట్టి.. భారత్‌-ఏ జట్టు తరపున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎవరీ ఆకాష్‌ దీప్‌ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ ఆకాష్‌ దీప్‌..?
27 ఏళ్ల ఆకాష్ ఆకాష్‌ దీప్‌ బీహార్‌లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్‌ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. క్రికెట్‌ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్‌ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు.

ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్‌ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్‌ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్‌లోని ఓ క్రికెట్‌ ఆకాడమీలో దీప్‌ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్‌లోని ఖేప్ క్రికెట్' టెన్నిస్‌ బాల్‌ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్‌ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్‌ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ డివిజన్‌ మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్‌ లభించింది.

ఓ సారి కోల్‌కతాలోని రేంజర్స్ గ్రౌండ్‌లో మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీమ్  డైరెక్టర్ జోయ్‌దీప్ ముఖర్జీ దృష్టిలో ఆకాష్‌ దీప్‌ పడ్డాడు. ఆకాష్‌ దీప్‌ బౌలింగ్‌ చేస్తున్నప్పుడు  కీపర్ స్టంప్‌ల వెనుక 10 గజాల దూరంలో నిల్చోడం చూసి జోయ్‌దీప్ ముఖర్జీ ఆశ్చర్యపోయారు.

వెంటనే అండర్‌-23 కోచ్‌  సౌరాశిష్‌ను పిలిపించి ఆకాష్‌ దీప్‌ గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి  బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీ విజన్‌ 2020 పోగ్రాంకు దీప్‌ను ముఖర్జీ రిఫర్‌ చేశాడు. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది.

సౌరవ్ గంగూలీ విజన్‌ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో ఆకాష్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్‌ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ఆకాష్‌ పాల్గొనున్నాడు. ఆ తర్వాత 2019లో బెంగాల్‌ తరపున ఆకాష్‌ దీప్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

ఓవరాల్‌గా క్రికెట్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన ఆకాష్‌ 103 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ.20 లక్ష్లల కనీస్‌ ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది.

ఇంగ్లండ్‌తో మూడు టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్‌ గిల్, కేఎల్ రాహుల్, రజత్‌ పటీదార్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌ దీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement