అరంగేట్రంలో ఆకాశ్ దీప్ అద్భుతాలు (PC: BCCI)
Ind vs Eng 4th Test- Akash Deep shows levels to Bazball: టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్ అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ బెంగాల్ పేసర్.. శుభారంభం అందుకున్నాడు.
రాంచి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ .. ఆకాశ్ దీప్‌నకు బంతినిచ్చాడు. తన తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు.
ఈ క్రమంలో నాలుగో ఓవర్లో మరోసారి బాల్ అందుకున్న ఆకాశ్.. జాక్ క్రాలే క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే, అది నోబాల్‌గా తేలడంతో ఆకాశ్ దీప్‌నకు నిరాశ తప్పలేదు. అయితే, అతడు మరింత పట్టుదలగా నిలబడి తన పేస్ పవర్ ఏంటో ఇంగ్లండ్ బ్యాటర్లకు రుచిచూపించాడు.
Drama on debut for Akash Deep! 🤯😓
— JioCinema (@JioCinema) February 23, 2024
A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
పదో ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. రెండో బంతికి ఓపెనర్ బెన్ డకెట్(11)ను అవుట్ చేసిన ఆకాశ్ దీప్.. నాలుగో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మరుసటి రెండో ఓవర్లోనే జాక్ క్రాలే(42)ను అద్భుతరీతిలో బౌల్డ్ చేశాడు.
ఆకాశ్ నో బాల్ తప్పిదంతో లైఫ్ పొందిన క్రాలే మళ్లీ అతడి చేతికే చిక్కడం విశేషం. ఇలా అరంగేట్రంలోనే బజ్‌బాల్‌కు కళ్లెం వేస్తూ ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చిన ఆకాశ్ దీప్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో అతడి పేరు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో ఆకాశ్ దీప్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: Ind vs Eng: ఐదో టెస్టుకు కీలక స్పిన్నర్ దూరం.. ప్రకటించిన ఇంగ్లండ్! కారణం ఇదే
WWW 🤝 Akash Deep!
— BCCI (@BCCI) February 23, 2024
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/YANSwuNsG0
Comments
Please login to add a commentAdd a comment