కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో బంగ్లా ఓపెనర్లకు చుక్కలు చూపించాడు.
తొలి సెషన్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం ఇద్దరినీ ఆకాష్ పెవిలియన్‌కు పంపాడు. తొలుత జకీర్ హసన్‌ను ఔట్ చేసిన దీప్.. ఆ తర్వాత షాద్మాన్‌ను ఎల్బీ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆకాష్ దీప్ చాకచక్యానికి రోహిత్ పిధా అయిపోయాడు.
అసలేం జరిగిందంటే?
బంగ్లా ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన ఆకాష్.. తొలి బంతిని షాద్‌మన్ ఇస్లామ్‌కు లెంగ్త్ బాల్‌గా సంధించాడు. అయితే దానిని లెగ్ సైడ్ ఫ్లిక్ చేయడానికి బంగ్లా బ్యాటర్ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి బ్యాక్‌పాడ్‌కు తాకింది.
వెంటనే ఎల్బీకి ఆకాష్ గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. రోహిత్ రివ్యూకు వెళ్లాళా వద్ద అన్న సందిగ్ధంలో పడ్డాడు. కానీ దీప్ మాత్రం రివ్యూకు వెళ్లాలని పట్టుబట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మను ఒప్పించి డీఆర్‌ఎస్‌కు వెళ్లేలా చేశాడు.
బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను క్లిప్ చేసినట్లు తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. అయితే రిప్లే చూసిన రోహిత్ వావ్ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. మిగితా సహాచర ఆటగాళ్లు ఆకాష్ వద్దకు వచ్చి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
😮 When the giant screen showed three Reds ⭕⭕⭕
Akash Deep gets his second courtesy of a successful DRS!
Live - https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/ZyGJfgBdjW— BCCI (@BCCI) September 27, 2024
Comments
Please login to add a commentAdd a comment