
Courtesy: IPL Twitter
దేశవాలీ క్రికెట్‌లో రాని గుర్తింపు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(ఐపీఎల్) వస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ఇప్పటివరకు జరిగిన 14 సీజన్ల నుంచి కనీసం ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు తమ ఆటతీరుతో మెరిసి సెలెక్టర్ల దృష్టిలో పడుతున్నారు. తాజా సీజన్‌లో తిలక్ వర్మ, ఆయుష్ బదోని, అనూజ్ రావత్ లాంటి యంగ్ కుర్రాళ్లు తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. వీరి జాబితాలో ఆకాశ్ దీప్ కూడా ఉంటాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకాశ్ దీప్ ప్రస్తుతం జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడి ఐదు వికెట్లు తీసిన ఆకాశ్‌దీప్ కీలకబౌలర్‌గా ఎదుగుతున్నాడు.
కాగా ఆకాశ్‌దీప్ చిన్నతనంలో చాలా కష్టాలు అనుభవించాడు. బిహార్‌కు చెందిన అతను.. తన తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకంగా క్రికెటర్ అయ్యాడు. వద్దని చెప్పినా పట్టుదలతో క్రికెటర్‌గా మారాడు. ఆకాశ్ దీప్ పుట్టిన ఊరిలో క్రికెట్ ఆడడం పెద్ద నేరంగా పరిగణించేవారట. అసలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండేది కాదంట. అలా చిన్నతనంలో క్రికెట్ తన భవిష్యత్తు అవుతుందని అతను ఊహించలేదట. ఆటపై ఉన్న ఇష్టం, పట్టుదల తనను క్రికెట్‌వైపు నడిపించాయని ఆర్‌సీబీ కాండిడ్ ఇంటర్య్వూలో ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి చేతి నుంచి డెబ్యూ క్యాప్ అందుకోవడం సంతోషంగా అనిపించిందని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది'
IPL 2022: ఆ క్రికెటర్‌ను తీసుకోవాల్సిందే.. సీఎస్‌కేకు అభిమానుల డిమాండ్