Asian Games 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ ఆకాశ్ దీప్‌ను అదృష్టం వరించింది. ఆసియా క్రీడల్లో పాల్గొననున్న భారత పురుషుల క్రికెట్ జట్టులో అతడికి చోటు దక్కింది. శివం మావి స్థానంలో ఈ బెంగాల్ ఫాస్ట్ బౌలర్‌ను చైనాకు పంపనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన చేసింది.
మావి వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా అతడి స్థానంలో ఆకాశ్ దీప్‌ను ప్రధాన జట్టులోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా బిహార్‌కు చెందిన ఆకాశ్ దీప్.. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఐపీఎల్‌లో ఎన్ని వికెట్లు తీశాడంటే
2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఈ 26 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్.. అదే ఏడాది లిస్ట్-ఏ(వన్డే), ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు. 2021 (సెకండ్ ఫేజ్)లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఆకాశ్ దీప్.. ఇప్పటి వరకు మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీశాడు.
ఆకాశ్ దీప్- శివం మావి(PC: IPL/BCCI)
టీ20 ఫార్మాట్‌లో
ఈ క్రమంలో శివం మావి గాయపడటంతో చైనాకు వెళ్తున్న టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. కాగా అండర్-19 వరల్డ్‌కప్-2018 గెలిచిన జట్టులో సభ్యుడైన యూపీ పేసర్ మావి దురదృష్టవశాత్తూ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
పూజా వస్త్రాకర్ ప్రధాన జట్టులోకి
కాగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు చైనాలోని హొంగ్జూ వేదికగా.. ఆసియా క్రీడలు-2023 ఆరంభం కానున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు 28 నుంచి టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు షురూ అవుతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొననున్న మహిళా క్రికెట్ జట్టుకు పేసర్ అంజలి శార్వాణి దూరం కాగా.. పూజా వస్త్రాకర్ ప్రధాన జట్టులోకి వచ్చింది.
19వ ఆసియా క్రీడలకు భారత జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్.
స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: యశ్ ఠాకూర్, సాయికిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
చదవండి: Asia Cup: అభిమానులకు చేదువార్త.. ఫైనల్‌కు వర్షం ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment