
రాంచీ: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో పంజాబ్‌కు చెందిన ఆకాశ్‌దీప్ సింగ్... మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక గోస్వామి విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలకు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించారు.
ఆకాశ్‌దీప్ 20 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 19 నిమిషాల 55 సెకన్లలో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (1గం:20ని:10 సెకన్లు) అధిగమించాడు. ప్రియాంక 1 గంట 28 నిమిషాల 50 సెకన్లలో లక్ష్యానికి చేరి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (1గం:29ని:20 సెకన్లు) అధిగమించింది.
చదవండి: టీ20 బ్లాస్ట్‌లో దుమ్మురేపనున్న మ్యాక్స్‌వెల్.. ఏ జట్టుకు అంటే..?
Comments
Please login to add a commentAdd a comment