విజయం అంచున విరాట్ సేన | Zealand require another 315 runs with 6 wickets remaining | Sakshi
Sakshi News home page

విజయం అంచున విరాట్ సేన

Published Mon, Sep 26 2016 11:22 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

విజయం అంచున విరాట్ సేన

విజయం అంచున విరాట్ సేన

కాన్పూర్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇక్కడ గ్రీన్ పార్క్ జరుగుతున్న తొలి టెస్టులో  టీమిండియా విజయం అంచున నిలిచింది. ఇంకా భారత్ మూడు వికెట్లు సాధిస్తే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. 434 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ ఆదిలోనే చుక్కెదురైంది. 93/4 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ వరుసగా మూడు కీలక వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. లూక్ రోంచీ(80), వాట్లింగ్(18), క్రెయిగ్(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. వీటిలో ఒకటి జడేజాకు దక్కగా, రెండు వికెట్లను షమీ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యం.

 

తొలి ఇన్నింగ్స్లలో భారత్ 318, న్యూజిలాండ్ 262 పరుగులు చేయగా, భారత్ రెండో ఇన్నింగ్స్ను 377/5 వద్ద డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించగా, బౌలర్లలో స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా రాణించారు. అశ్విన్ ఏడు, జడేజా ఐదు వికెట్లు పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement