ICC Cricket World Cup 2023- India vs Bangladesh- Pune- Updates& Highlights: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పుణె వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అప్‌డేట్లు...
కోహ్లి సెంచరీ.. బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం
వన్డే వరల్డ్‌కప్-2023లో రోహిత్ సేన వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీ(103)తో చెలరేగాడు. వన్డే కెరీర్‌లో 48వ శతకం నమోదు చేసిన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
స్కోరు: టీమిండియా- 261/3 (41.3)
బంగ్లాదేశ్- 256/8 (50)
టీమిండియా విజయ లక్ష్యం- 257
37: టీమిండియా స్కోరు: 223-3
29.1: అయ్యర్ అవుట్
శ్రేయస్ అయ్యర్(19) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి 56, రాహుల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 178/3 (29.1).
26.6: కోహ్లి అర్ధ శతకం
టీమిండియా వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్లలో టీమిండియా స్కోరు: 171-2
19.2: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
గిల్(53) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కోహ్లి 29, శ్రేయస్ అయ్యర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 133/2 (19.3)
18.1: గిల్ హాఫ్ సెంచరీ
షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్లో పరుగు తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న గిల్. కోహ్లి 29, గిల్ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 130/1 (19)
17 ఓవర్లలో టీమిండియా స్కోరు: 122/1
గిల్ 47, కోహ్లి 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.
విజయ లక్ష్యం 257.. దంచికొడుతున్న గిల్.. రోహిత్ ఫిఫ్టీ మిస్
12.4: బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిన రోహిత్ శర్మ 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. హసన్ మహమూద్ బౌలింగ్‌లో హృదోయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ గిల్ 40 పరుగులతో, కోహ్లి 0తో క్రీజులో ఉన్నారు. స్కోరు: 91/1 (12.4).
►పవర్ ప్లే(10 ఓవర్లు)లో టీమిండియా స్కోరు: 63-0
►8.6: అర్ధ శతకం పూర్తి చేసుకున్న టీమిండియా
రోహిత్ 33, గిల్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 50-0(9)
►ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్న రోహిత్ శర్మ
ఆరు ఓవర్లలో టీమిండియా స్కోరు: 37-0. రోహిత్ శర్మ 5 ఫోర్లు, ఒక సిక్సర్‌సాయంతో 31 పరుగులతో క్రీజులో ఉన్నాడు. గిల్ 6 పరుగులతో ఆడుతున్నాడు.
రాణించిన ఓపెనర్లు.. బంగ్లాదేశ్ స్కోరెంతంటే
►టీమిండియాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్(66) అర్ధ శతకాలు సాధించారు. లోయర్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం 38, మహ్మదుల్లా 46 పరుగులతో రాణించారు.
భారత బౌలర్లలో పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా రెండు, మహ్మద్ సిరాజ్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా రెండు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
46.5: సిరాజ్ బౌలింగ్‌లో అహ్మద్ అవుట్
మహ్మద్ సిరాజ్‌బౌలింగ్‌లో నసూం అహ్మద్(14) అవుటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది.
42.3: ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
జడేజా బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీం(38) అవుట్. 42.3 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది
37.2: ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తౌహిద్ హృదోయ్(16) అవుట్.
37 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు: 178/4
ముష్ఫికర్ రహీం 29, హృదోయ్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
27.4: నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజులో పాతుకుపోయిన లిటన్ దాస్ ఎట్టకేలకు అవుటయ్యాడు. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో లిటన్ దాస్ ఇచ్చిన క్యాచ్‌ను గిల్ అందుకోవడంతో బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు: 137/4 (27.4)
26 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు:133/3
మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
24.1: సిరాజ్ బౌలింగ్లో 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మెహదీ హసన్ మిరాజ్ పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లా మూడో వికెట్ కోల్పోయింది. హృదోయ్, లిటన్ దాస్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.
23 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 118/2
లిటన్ దాస్ 53, హసన్ మిరాజ్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.
19.6: షాంటో అవుట్
జడేజా బౌలింగ్‌లో నజ్ముల్ షాంటో ఎల్బీడబ్ల్యూ. 8 పరుగులకే వెనుదిరిగిన బంగ్లా కెప్టెన్.
14.4: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో తాంజిద్ హసన్(51) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. లిటన్ దాస్ 39, శాంటో ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 94-1(15)
అర్ద శతకం పూర్తి చేసుకున్న తాంజిద్ హసన్
13.5: శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పరుగు తీసి వన్డే కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన తాంజిద్. మొత్తంగా 41 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బంగ్లా స్కోరు: 90/0 (14).
నిలకడగా ఆడుతున్న బంగ్లా ఓపెనర్లు
బంగ్లా ఓపెనర్లు తాంజిద్ 42, లిటన్ దాస్ 28 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరి మెరుగైన భాగస్వామ్యంతో బంగ్లా 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది.
8 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు: 37-0
తాంజిద్ 23, లిటన్ దాస్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
5 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 10/0.
►టాస్ గెలిచిన బంగ్లాదేశ్
►తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
►రెగ్యులర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కావడంతో ఈ మ్యాచ్ బంగ్లా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన నజ్ముల్ షాంటో.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్
తుది జట్లు:
►టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
►బంగ్లాదేశ్
లిటన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, నసూమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం.
Comments
Please login to add a commentAdd a comment