టీమిండియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మొదటి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. కాగా తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత్‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంటామని శాంటో థీమా వ్యక్తం చేశాడు.
"భారత్‌తో టీ20 సిరీస్‌కు మేము అన్ని విధాల సన్నద్దమయ్యాం. ఈ సిరీస్‌ను గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాము. దూకుడుగా ఆడాలనుకుంటున్నాము. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరేందుకు మాకు మంచి అవకాశం లభించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము సెమీస్‌కు చేరుకోలేకపోయాము.
మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరూ భారత్‌పై సత్తాచాటుతారని భావిస్తున్నాను. మేము భారత్‌తో టెస్ట్‌లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. మేము ప్రస్తుతం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. టెస్టు క్రికెట్‌కు టీ20 పూర్తిగా భిన్నం. ఆ రోజున ఎవరూ మెరుగైన ప్రదర్శన చేస్తే వారిదే విజయమని" షాంటో పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2024: ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ
Comments
Please login to add a commentAdd a comment